IND vs PAK : ఐసీసీ టోర్నీలో చిరకాల ప్రత్యర్థిపై శివాలూగిపోయే భారత(Team Inida) క్రికెటర్లు ఈసారి తేలిపోయారు. టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లలో రిషభ్ పంత్(42) మినహా ఒక్కరంటే ఒక్కరు పాకిస్థాన్(Pakistan) బౌలర్లను దీటుగా ఎదుర్కొని నిలబడలేకపోయారు. బ్యాటింగ్ యూనిట్ వైఫల్యంతో టీమిండియా 119 పరుగులకే ఆలౌటయ్యింది. అలాగని న్యూయార్క్ పిచ్‌పై పాక్ బౌలర్లు నసీం షా(3/21), హ్యారిస్ రవుఫ్(3/21)లు మరీ ఏమంత ప్రమాదకరంగా కనిపించలేదు. కానీ, భారత ఆటగాళ్లే అనవసర షాట్లతో వికెట్ పారేసుకున్నారు. ఒంటరి సైనికుడిలా పాక్ బౌలర్లపై విరుచుకుపడిన పంత్.. అక్షర్ పటేల్(20)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా(7) సైతం చేతులెత్తేయడంతో రోహిత్ సేన దాయాదికి ఓ మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
వర్షం కారణంగా ఆట్ ఆలస్యమైన పోరులో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. షాహీన్ ఆఫ్రిది ఓపెనర్‌గా ఐర్లాండ్‌పై విఫలమైన విరాట్ కోహ్లీ(4)ని నషీం షా బోల్తా కొట్టించాడు. ఆ షాక్ నుంచి తేరుకొనేలోపే ఊరించే బంతితో షాహీన్ ఆఫ్రిది డేంజరస్ రోహిత్ శర్మ(12)ను పెవిలియన్ చేర్చాడు. దాంతో, 19 పరుగులకే భారత్ రెండో వికెట్ పడింది.
A riveting Powerplay in New York 🔥
Pakistan have sent the Indian openers back as Rishabh Pant and Axar Patel look to build on.#T20WorldCup | #INDvPAK | 📝: https://t.co/pMWMLPcinR pic.twitter.com/rD67TMrFVg
— ICC (@ICC) June 9, 2024
ఆ దశలో క్రీజులోకి వచ్చిన ప్రస్తుతం అక్షర్ పటేల్(20), రిషభ్ పంత్(42) జతగా దూకుడుగా ఆడాడు. నసీం షా ఓవర్లో వికెట్ల వెనకాల కండ్లు చెదిరే సిక్సర్ బాదాడు. వీళ్లిద్దరూ బౌండరీలతో పాక్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టి మూడో వికెట్‌కు 39 రన్స్ జోడించారు. అయితే.. అక్షర్‌ను బౌల్డ్ చేసి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని నసీం విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్(7), శివం దూబే(3)లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు.
And Amir gets Jadeja next ball – he’s on a hat-trick! #INDvPAK https://t.co/HTz1JMMsjC
— ESPNcricinfo (@ESPNcricinfo) June 9, 2024
అమిర్ వేసిన 15వ ఓవర్లో పంత్ భారీ షాట్ ఆడబోయాడు. కానీ, బంతి మిడాఫ్‌లో గాల్లోకి లేవడంతో బాబర్ చక్కగా క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత బంతికే రవీంద్ర జడేజా(0) బాల్‌ను నేరుగా ఇమద్ వసీం చేతుల్లోకి పంపాడు. అంతే.. అప్పటిదాకా 894తో పటిష్ట స్థితిలో ఉన్న భారత్ ఒక్కసారిగా ఆలౌట్ ప్రమాదంలో పడింది. 96 పరుగులకే 7 వికెట్లు పడిన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించే బాధ్యత వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(7) తీసుకున్నాడు.
SKY hasn’t found his best against 🇵🇰#INDvPAK #T20WorldCup pic.twitter.com/C2mdWV3xiA
— ESPNcricinfo (@ESPNcricinfo) June 9, 2024
టెయిలెండర్ అర్ష్‌దీప్ సింగ్(9) అండతో స్కోర్‌బోర్డును ముందుకు నడిపించాడు. అయితే.. హ్యారిస్ రవుఫ్ వేసిన 18వ ఓవర్లో పాండ్యా ఒక ఫోర్ కొట్టి సిక్సర్ బాదే క్రమంలో బౌండరీ వద్ద ఇఫ్తికార్‌కు దొరికాడు. అక్కడితో టీమిండియా స్కోర్ 140 దాటుతుందనే ఆశలు ఆవిరయ్యాయి. 19 వ ఓవర్లో అర్ష్‌దీప్ రనౌట్ కావడంతో భారత జట్టు ఇన్నింగ్స్ 119 పరుగుల వద్దే ముగిసింది.
Pakistan bounce back and how 🤌
👉 https://t.co/Vl1gwzcPbh | #INDvPAK | #T20WorldCup pic.twitter.com/IDqXytnLkh
— ESPNcricinfo (@ESPNcricinfo) June 9, 2024