సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు అనుమతించండి
కొత్త సినిమాల విడుదల సందర్భంగా టికెట్ ధరల పెంపును నిలిపివేస్తూ గతంలో సింగిల్ జడ్జి జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ‘మన శంకర వర ప్రసాద్', ‘రాజాసాబ్' చిత్రాల నిర్మాతలు మంగళవారం హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
- హైకోర్టుకు మన శంకరవరప్రసాద్, రాజాసాబ్ సినిమాల నిర్మాతలు
- నేడు విచారించనున్న ధర్మాసనం
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : కొత్త సినిమాల విడుదల సందర్భంగా టికెట్ ధరల పెంపును నిలిపివేస్తూ గతంలో సింగిల్ జడ్జి జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ‘మన శంకర వర ప్రసాద్’, ‘రాజాసాబ్’ చిత్రాల నిర్మాతలు మంగళవారం హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అఖండ-2 సినిమా టికెట్ ధరల పెంపు నిలిపివేత పిటిషన్లపై తుది తీర్పు వచ్చే వరకు ఆదేశాలు జారీ చేయరాదని హైకోర్టును కోరారు.
టికెట్ల పెంపు వివాదంపై విచారణ పూర్తయ్యేవరకు టికెట్ల ధరల పెంపునకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని గత డిసెంబరు 9న సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని విజ్ఞప్తిచేశారు. ప్రత్యేక షోలకు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వాలని ‘మన శంకర వరప్రసాద్’ నిర్మాతలు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి, రాజాసాబ్ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ అప్పీళ్లను దాఖలు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

