Pankaj Advani: 26 సార్లు వరల్డ్ ఛాంపియన్.. పంకజ్ అద్వానీ నయా చరిత్ర..
Pankaj Advani: భారత క్రీడాకారుడు పంకజ్ అద్వానీ నయా చరిత్ర సృష్టించాడు. దోహా వేదికగా మంగళవారం ఇంటర్నేషనల్ బిలియర్డ్స్, స్నూకర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ముగిసిన వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
Pankaj Advani: బిలియర్డ్స్‌లో భారత క్రీడాకారుడు పంకజ్ అద్వానీ నయా చరిత్ర సృష్టించాడు. దోహా వేదికగా మంగళవారం ఇంటర్నేషనల్ బిలియర్డ్స్, స్నూకర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ముగిసిన వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. వరల్డ్ ఛాంపియన్‌గా నిలవడం పంకజ్‌కు ఇది ఏకంగా 26వ సారి కావడం గమనార్హం. ఫైనల్ పోరులో పంకజ్.. 1000-416 తేడాతో భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారీని ఓడించాడు.
38 ఏండ్ల పంకజ్.. ఈ ఛాంపియన్‌షిప్‌లో లాంగ్ ఫార్మాట్లో తొమ్మిది టైటిల్స్ నెగ్గగా పాయింట్ ఫార్మాట్లో రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు గెలిచాడు. అంతేగాక స్నూకర్‌లో ఎనిమిది సార్లు, టీమ్ ఫార్మాట్లో ఒకసారి ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. తాజాగా దోహాలో ముగిసిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పంకజ్.. 900-273 తేడాతో భారత్‌కే చెందిన రూపేష్ షా ను ఓడించాడు. తద్వారా ఈ పోటీలలో ప్రథమ స్థానంతో పాటు ద్వితీయ, తృతీయ స్థానాలను కూడా భారత ఆటగాళ్లే గెలుచుకున్నారు. 14 ఏండ్లకే ఈ ఆటలో ఎంట్రీ ఇచ్చిన పంకజ్.. రికార్డు స్థాయిలో విజయాలు సాధిస్తుండటం గమనార్హం.
IBSF World Billiards Champion (Long Format) 🏆😊
This is for us India 🇮🇳🙏🏻 pic.twitter.com/kLEdRPpnnq— Pankaj Advani (@PankajAdvani247) November 21, 2023
🇮🇳 Triumph in Doha, 🇶🇦 at the IBSF World Championships🎱
* Pankaj Advani clinches his 26th World Billiards Title, defeating compatriot Sourav Kothari in a masterful display of skill and winning a glorious #Gold🥇 and the 🏆
* As Sourav gets a #Silver, compatriots Rupesh Shah… pic.twitter.com/ptE99MaENk
— SAI Media (@Media_SAI) November 21, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

