హనుమకొండ, నవంబర్ 18 : వచ్చే నెలలో కర్ణాటక రాష్ట్రంలో జరుగనున్న జాతీయ స్థాయి చెస్ పోటీలకు హనుమకొండ సుబేదారిలోని ఎస్సార్ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని పల్లూరి లక్ష్మి శార్వాణి ఎంపికయ్యారు.
మంగళవారం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని వర్డ్ అండ్ డీ జూనియర్ కాలేజీలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-19 ఎస్జీఎఫ్ఐ చెస్ పోటీల్లో మొదటి స్థానం దకించుకుంది. జాతీయ స్థాయి చెస్ పోటీలకు ఎంపికైన శార్వాణిని ఎస్సార్ విద్యా సంస్థల అధినేత వరదారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్, బోధన సిబ్బంది శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.