కరాచీ: భారత జట్టుకు మద్దతిచ్చాడనే కారణంతో పాకిస్థానీ కబడ్డీ ప్లేయర్ ఉబైదుల్లా రాజ్‌పుత్‌పై ఆ దేశ కబడ్డీ సమాఖ్య క్రమశిక్షణా చర్యలకు దిగింది. ఇటీవల బహ్రెయిన్‌లో జరిగిన జీసీసీ కప్‌లో భాగంగా ఉబైదుల్లా.. భారత జెర్సీ వేసుకోవడమే గాక మువ్వన్నెల జాతీయ జెండాను ప్రదర్శించిన ఫోటోలు, వీడియోలు బహిర్గతమవడంతో పాకిస్థాన్ కబడ్డీ సమాఖ్య అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈనెల 16న జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్‌గా జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా ఉబైదుల్లాతో పాటు మరో 15 మంది పాకిస్థాన్ కబడ్డీ ఆటగాళ్లకు నోటీసులు పంపినట్టు పాక్ కబడ్డీ ఫెడరేషన్ అధ్యక్షుడు రానా సర్వర్ తెలిపాడు.