రెండో మ్యాచ్‌లోనూ అదే జోరు. పాకిస్థాన్ స్ట్రాటజీ మరోసారి వర్కవుట్ అయింది. న్యూజిలాండ్‌పై పాక్ అనూహ్య విజయం సాధించింది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి పాకిస్థాన్ టీ20 ప్రపంచ కప్‌లో విజయయాత్ర కొనసాగిస్తోంది. 18.4 ఓవర్లలోనే కేవలం 5 వికెట్ల నష్టానికి పాకిస్థాన్ 135 పరుగులు చేసి న్యూజిలాండ్‌పై గెలిచింది.
తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసి పాకిస్థాన్‌కు 135 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే.. పాక్ బౌలర్లు చెలరేగిపోవడంతో తక్కువ స్కోర్‌కే న్యూజిలాండ్ పరిమితం అయింది.
పాకిస్థాన్ ప్లేయర్లలో రిజ్వాన్ 34 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఆసిఫ్ అలీ 12 బంతుల్లో 27 పరుగులు, షోయబ్ మాలిక్ 20 బంతుల్లో 26 పరుగులు చేసి పాకిస్థాన్‌కు విజయం అందించారు.
న్యూజిలాండ్ బౌలర్లలో ఇష్ సోధి 4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. సాంత్నర్ 4 ఓవర్లు వేసి 1 వికెట్ తీశాడు. టిమ్ సౌథీ 4 ఓవర్లు వేసి 1 వికెట్ తీశాడు. ట్రెంట్ బౌల్ట్ 3.4 ఓవర్లు వేసి ఒక వికెట్ తీశాడు.
పాకిస్థాన్ బౌలర్ హరిశ్ రౌఫ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. 4 ఓవర్లలో 4 వికెట్లు తీసి 22 పరుగులనే హరిశ్ అందించాడు.
Pakistan's blazing run continues 🔥#T20WorldCup | #PAKvNZ | https://t.co/tTj0Whv0OD pic.twitter.com/5yKgmDES4t
— ICC (@ICC) October 26, 2021
It was a win for the teams in green today on Day 10 of the #T20WorldCup
— ICC (@ICC) October 26, 2021
An important win for South Africa, with Pakistan two from two in the Super 12 stage 🎉@royalstaglil | #InItToWinIt pic.twitter.com/qCfk1kUVR6
Trent Boult with a vital wicket for New Zealand 👊
— T20 World Cup (@T20WorldCup) October 26, 2021
He whacks Imad Wasim on the foot and he is adjudged lbw.
He walks back to the pavilion for 11. #T20WorldCup | #PAKvNZ | https://t.co/rpw034CkPm pic.twitter.com/WJ3zUIApG8