వెల్లింగ్టన్ : పాకిస్థాన్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను న్యూజిలాండ్ 4-1తో చేజిక్కించుకుంది. బుధవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో కివీస్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత పాక్.. నిర్ణీత ఓవర్లలో 128/9స్కోరుకు కుప్పకూలింది. సారథి సల్మాన్ (51) మరోసారి ఆ జట్టును ఆదుకున్నాడు. నీషమ్ (5/22) ఐదు వికెట్లతో చెలరేగాడు. ఛేదనను కివీస్ 10 ఓవర్లలోనే దంచేసింది. టిమ్ సీఫర్ట్ (38 బంతుల్లో 97 నాటౌట్, 6ఫోర్లు, 10సిక్సర్లు)ఇన్నింగ్స్‌తో కివీస్ అలవోకగా గెలిచింది.