ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ పోటీలకు సన్నద్ధమవుతున్న పాకిస్థాన్ జట్టు(Pakistan Team)కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే స్టార్ పేసర్ నసీం షా (Naseem Shah) గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. భారత పర్యటనకు వెళ్ధామనుకుంటే వీసా(Visa) ఇంకా రాలేదు. ఇస్లామాబాద్(Islamabad)లోని భారత దౌత్య కార్యాలయంలో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు.
దాంతో, ముందుస్తుగా తీసుకున్న దుబాయ్ టీమ్ బాండింగ్ ట్రిప్ రద్దు అయింది. అందువల్ల బాబర్ సేన, కోచింగ్ సిబ్బంది స్వదేశంలోనే ఉండిపోయారు. వీసా మంజూరు కాగానే బాబర్ ఆజాం నేతృత్వంలోని పాకిస్థాన్ సెప్టెంబర్ 27వ తేదీన దుబాయ్ మీదుగా ఇండియాకు రానుంది. పాకిస్థాన్ జట్టు సెప్టెంబర్ 29న న్యూజిలాండ్తో హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం(Hyderabad uppal stadium)లో వామప్ మ్యాచ్లు ఆడనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్ అక్టోబర్ 14న అహ్మదాబాద్లో తలపడనున్నాయి. అయితే.. ప్రపంచ కప్ చరిత్రలో దాయాదిపై టీమిండియాదే పైచేయి.
ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్లో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన బాబర్ సేన
ఈమధ్యే ముగిసిన ఆసియా కప్(Asia Cup 2023) సూపర్ 4 మ్యాచ్లో టీమిండియా చేతిలో బాబర్ సేన చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో విరుచుకుపడిన ఆ మ్యాచ్లో పాక్ 228 పరుగుల తేడాతో చిత్తు అయింది. దాంతో, ఈసారి ఎవరు గెలుస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.