BCCI – SBI Life : భారత క్రికెట్ బోర్డు(BCCI) భారీగా ఆదాయం సమకూర్చుకోవడంపై కన్నేసింది. ఈమధ్యే ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్(IDFC first Bank)కు టైటిల్ స్పాన్సర్ హక్కులను అప్పజెప్పిన బీసీసీఐ తాజాగా అధికారిక స్పాన్సర్(Official Sponser)గా ఎస్బీఐ లైఫ్(SBI Life)కి హక్కులు కట్టబెట్టింది. మూడేళ్ల కాలాని (2023 – 2026)కి బీసీసీఐ, ఎస్బీఐ లైఫ్ మధ్య రూ.47 కోట్ల ఒప్పందం కుదిరింది. భారత జట్టు ఆడబోయే దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచులకు ఈ ఇన్షూరెన్స్ కంపెనీ అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.
ఇకనుంచి టీమిండియా ఆడే ఒక్కో మ్యాచ్‌కు రూ.85 లక్షలు బీసీసీఐకి ముట్టజెప్పనుంది. ఈ విషయాన్ని సెక్రటరీ జై షా() వెల్లడించాడు. బీసీసీఐ అధికారిక స్పాన్సర్‌గా ఎంపికైన ఎస్బీఐ లైఫ్‌కు స్వాగతం. ఈ మూడేళ్లలో వరల్డ్ కప్‌తో పాటు వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ టోర్నీల్లో టీమిండియా అఫీషియల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది అని జై షా ఓ ప్రకటనలో తెలిపాడు. ఈ మూడేళ్ల కాలంలో భారత జట్టు 56 మ్యాచ్‌లు ఆడనుంది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య మొహాలీ స్టేడియం(Mohali Stadium)లో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌తో బీసీసీఐ అధికారిక స్పాన్సర్‌గా ఎస్బీఐ లైఫ్ ప్రయాణం మొదలైంది. ఈ మ్యాచ్‌లో ఇండియా 5 వికెట్లతో ఆసీస్(Australia)పై థ్రిల్లింగ్ విజయం సాధించింది.
కెప్టెన్ రాహుల్(56 నాటౌట్), ఆసీస్‌పై వరుసగా మూడుసార్లు గోల్డెన్ డక్ అయిన సూర్యకుమార్ యాదవ్(50) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలుపు వాకిట నిలిపారు.దాంతో, మూడు ఫార్మాట్లలో నంబర్ 1 జట్టుగా అవతరించింది.