కరాచీ: స్వదేశంలో చాంపియన్స్ ట్రోఫీకి ముందు జరుగుతున్న ముక్కోణపు సిరీస్లో పాకిస్థాన్ ఫైనల్కు దూసుకెళ్లింది. కరాచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్.. 6 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోరు చేసింది.
క్లాసెన్ (87), బ్రీట్జ్కె (83), బవుమా (82) రాణించారు. లక్ష్య ఛేదనను పాకిస్థాన్ మరో ఆరు బంతులు మిగిలుండగానే దంచేసింది. మహ్మద్ రిజ్వాన్ (122 నాటౌట్), అఘా సల్మాన్ (134) శతకాలతో కదం తొక్కి ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఫైనల్లో పాకిస్థాన్.. న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది.