T20 World Cup 2026 : పొట్టి ప్రపంచకప్ షెడ్యూల్ రావడమే కాదు.. మెగాటోర్నీ తేదీ కూడా దగ్గరపడుతోంది. ఇప్పటికే ఆతిథ్య దేశాలైన భారత్, శ్రీలంకలో 9 వేదికలను ఐసీసీ ఖరారు చేసేసింది. అంతా సవ్యంగా జరుగనుంది అనుకుంటే బంగ్లాదేశ్ బోర్డు.. ‘ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం మా జట్టును ఇండియా పంపించమ’ని తిరకాసు పెట్టింది. దాంతో.. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) పావులు కదుపుతోంది. ఐసీసీ అంగీకరిస్తే బంగ్లా మ్యాచ్‌లను తమ దేశంలో ఆడిస్తామని పీసీబీ అంటోంది.
ఇటీవల భారత్, బంగ్లాదేశ్ బోర్డుల మధ్య పెరిగిన దూరం ప్రపంచకప్ షెడ్యూల్‌పై పడేలా ఉంది. ప్రపంచకప్ మ్యాచ్‌లు భారత్‌లో ఆడబోమని బంగ్లా బోర్డు ఐసీసీకి ఈమెయిల్ పంపడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. భద్రతను కారణంగా చూపిన బంగ్లా బోర్డుతో ఐసీసీ ఛైర్మన్ జై షా(Jai Shah) మాట్లాడి ఒప్పిస్తారనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ మ్యాచ్‌లను మా దేశంలో ఆడించేందుకు సిద్దమంటూ పాకిస్థాన్ బోర్డు ముందుకొచ్చింది. శ్రీలంకలో మైదానాలు అందుబాటులో లేకుంటే మా స్టేడియాలకు అనుమతివ్వండని పీసీబీ అంటోంది.
🚨 T20 World Cup 2026 in Pakistan? 🚨
PCB expressed their Interest to host Bangladesh’s Matches in Pakistan if SL Venues aren’t available. [Geo News]
📷 ANI pic.twitter.com/amkdfKfcFi
— CricketGully (@thecricketgully) January 11, 2026
జియో సూపర్ నివేదిక ప్రకారం.. టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్‌ల విషయమై పాకిస్థాన్ బోర్డు సంప్రదింపులు జరుపుతోందట. శ్రీలంకలో స్టేడియాలు అందుబాటులో లేని పక్షంలో తమ దేశంలోని మైదానల్లో ఆ జట్టు మ్యాచ్‌లు ఆడించేందుకు పీసీబీ సన్నద్ధంగా ఉందట. ఒకవేళ ఐసీసీ అందుకు అంగీకరిస్తే తక్కువ సమయంలోనే తమ స్టేడియాలను సిద్ధం చేస్తామని పాక్ బోర్డు అంటోంది. మరి.. ఈ వ్యవహారంలో అనవసరంగా తలదూరుస్తున్న పీసీబీపై ఐసీసీ, బీసీసీఐ, శ్రీలంక క్రికెట్ ఎలా స్పందిస్తాయో చూడాలి. ఐసీసీ స్పందనను బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలని బీసీబీ అనుకుంటోంది.
పొట్టి ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ గ్రూప్ సీలో ఉంది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ అహ్మదాబాద్‌లో ఫిబ్రవరి 7న ఇంగ్లండ్‌తో తలపడాలి. కానీ, తాజా ఉద్రికత్తల నేపథ్యంలో బంగ్లాదేశ్ బోర్డు తమ జట్టును భారత్‌కు పంపేందుకు సుముఖంగా లేదు. ఒకవేళ ఐసీసీ చెప్పినా బంగ్లా బోర్డు వినకుంటే.. కో-హోస్ట్ అయిన శ్రీలంకకు ఆ జట్టు మ్యాచ్‌లను తరలించే అవకాశముంది. షెడ్యూల్ ప్రకారం లంకలోని రెండు మైదానాలే ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఎంపికయ్యాయి.
🚨 BCCI VS BCB FINISHED IN NO SOLUTION 🚨
– After a brief talk between the BCCI and BCB, the Bangladesh Cricket Board refused to travel to India for the T20 World Cup, citing player ‘safety and well-being’ concerns 😨
– What’s your take 🤔 pic.twitter.com/1l3booRh5r
— Richard Kettleborough (@RichKettle07) January 4, 2026
డిసెంబర్లో బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యను నిరసిస్తూ ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ (Mustafizur)ను తప్పించింది బీసీసీఐ. తమ పేసర్‌పై వేటును ఖండించిన బంగ్లాదేశ్ బోర్డు ప్రతిచర్యగా తమ జట్టును ప్రపంచకప్ కోసం భారత్‌కు పంపబోమని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.