Haris Rauf : టీ20 వరల్డ్ కప్లో మాజీ చాంపియన్ పాకిస్థాన్ (Pakistan) అనూహ్యరీతిలో ఇంటిదారి పట్టింది. టాపార్డర్ వైఫల్యం, గ్రూప్ రాజకీయాలు, సమిష్టితత్వం కొరవడడం వెరిసి లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాక్ క్రికెకటర్ల చెత్త ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. బాబర్ సేన ఆటతీరు అభిమానులకు మింగుడు పడడం లేదు. ప్రస్తుతం అమెరికాలోనే ఉన్న పాక్ ఆటగాళ్లు ఎక్కడ కంటపడినా ఫ్యాన్స్ కడిగి పారేస్తున్నారు.
తాజాగా పాకిస్థాన్ పేసర్ హ్యారిస్ రవుఫ్ సైతం ఇదే పరిస్థితి ఎదురైంది. దాంతో, చిర్రెత్తుకొచ్చిన అతడు ఒక అభిమానిపై గొడవకు దిగాడు. కోపంతో ఊగిపోయిన రవుఫ్ భార్య ముజ్నా మసూద్ మాలిక్(Mazna Masood Malik) వారిస్తున్నా వినకుండా అతడి వైపు గబగబా వెళ్లాడు. దాంతో, ఏం జరుగుతుందోనని రవుఫ్ భార్య కంగారు పడింది. అయితే.. అక్కడే ఉన్న ఒకతను పాక్ స్పీడ్స్టర్ను అడ్డుకొని వెనక్కి పంపాడు.
A heated argument between Haris Rauf and a fan in the USA. pic.twitter.com/d2vt8guI1m
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 18, 2024
అయినా సరే సదరు అభిమాని, రవుఫ్లు కాసేపు తిట్టుకున్నారు. అయితే.. గొడవకు అసలు కారణం ఏంటనేది మాత్రం తెలియలేదు. ‘అతడు కచ్చితంగా భారతీయుడే అయి ఉంటాడు’ అని రవుఫ్ అనడం వీడియోలో రికార్డు అయింది. అయితే.. సదరు అభిమాని ‘నేను పాకిస్థానీ’ అని బదులిచ్చాడు. దాంతో, రవుఫ్ కాస్త కూల్ అయ్యాడు. వరల్డ్ కప్లో దారుణ ఓటమిపై ఆ అభిమాని రవుఫ్ను నిలదీసి ఉంటాడు. అందుకనే మనోడు చిర్రుబుర్రులాడి ఉంటాడు అని అందరూఅనుకుంటున్నారు. రవుఫ్ గొడవ పడుతున్న వీడియో సోషల్ మీడియాల్ ట్రెండ్ అవుతోంది.