India vs Pakistan | కరాచీ: స్వదేశంలో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఓడి భంగపడ్డ పాకిస్థాన్‌కు భారత్‌తో కీలక పోరు ఎదుట భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఫకర్ జమాన్ గాయంతో ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు.
న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా అతడి కాలికి గాయమైంది. పాక్ ఛేదనలో అతడు బ్యాటింగ్‌కు వచ్చినా నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఇక ఈ టోర్నీలో ఫకర్ స్థానాన్ని పాక్.. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఇమామ్ఉల్ హక్‌తో భర్తీ చేయనుంది.