PAKW vs NZ : కొలంబోలో వరల్డ్ కప్ మ్యాచ్‌లకు అడ్డుపడుతున్న వరుణుడు ఈసారి త్వరగానే శాంతించాడు. ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక, దక్షిణాఫ్రికా మ్యాచ్‌ను ఐదుగంటలు ఆలస్యం చేసిన వర్షం.. పాకిస్థాన్, న్యూజిలాండ్ పోరుకు మాత్రమే బ్రేకిచ్చింది. వాన తగ్గడంతో సిబ్బంది గబగబా సూపర్ సాపర్స్ సాయంతో ఔట్‌ఫీల్డ్‌ను సిద్ధం చేశారు. అయితే.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఓవర్లు కుందించి.. 46 ఓవర్ల ఆట ఆడించనున్నారు.
డక్‌వర్త్ లూయిస్ ప్రకారం నాలుగు ఓవర్లు తగ్గించడమే కాకుండా.. నిబంధనలను సడలించారు. కొత్త నిబంధనల ప్రకారం పవర్ ప్లే తొమ్మిది ఓవర్లతో ముగియనుంది. ఒక బౌలర్‌కు పది ఓవర్లు వేసేందుకు అనుమతిస్తారు.. నలుగురికి తొమ్మది ఓవర్లు వేసేందుకు అవకాశముంటుంది. ఇన్నింగ్స్ బ్రేక్ 30 నిమిషాలు మాత్రమే ఉండనుంది. వర్షం అంతరాయం కలిగించే సరికి 52-3తో ఉన్న పాక్ యథావిధిగా ఇన్నింగ్స్ కొనసాగించనుంది.
The rains have disappeared for now, and we get underway in under 10 minutes. The match is now 46 overs a side #CWC25
Follow live 👉 https://t.co/p1H0nyNnj2 pic.twitter.com/EmOvMK3hW0
— ESPNcricinfo (@ESPNcricinfo) October 18, 2025