దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్లో ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాకిస్థాన్ క్రికెట్ జట్టు మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. యూఏఈలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం ఆ జట్టు.. ఆఫ్గానిస్థాన్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడింది. ఫీల్డింగ్ వైఫల్యాల కారణంగా ఆ జట్టు పరాభవం పాలైంది. క్రిక్ బజ్ నివేదిక ప్రకారం.. 2024 నుంచి ఆ జట్టు ఫీల్డ్‌లో 48 క్యాచ్‌లు మిస్ చేయగా పాక్ ఫీల్డర్లు 89 మిస్ ఫీల్డ్స్ చేశారు.