Shoaib Malik : పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) మరో చిక్కుల్లో పడ్డాడు. ఈమధ్యే మూడో పెండ్లితో వార్తల్లో నిలిచిన మాలిక్ ఇప్పుడు ‘మ్యాచ్ ఫిక్సింగ్'(Match Fixing) ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ(Basit Ali) తాజాగా మాట్లాడుతూ మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడడ్డాని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు అతడిని చాంపియన్స్ వన్డే కప్‌లో ఓ జట్టుకు మెంటార్‌గా నియమించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై కూడా బసిత్ మండిపడ్డాడు.
బసిత్ ఆలీ తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘షోయబ్ మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. అందుకు నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయి. కావాలంటే అందరి ముందు అతడి బాగోతం బయటపెడుతా’ అని అన్నాడు. అయితే.. అలీ వ్యాఖ్యలపై మాలిక్ ఇంకా స్పందించలేదు. అయినా పాక్ క్రికెటర్లపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడం.. వాళ్లు నిజంగా ఫిక్సింగ్‌కు పాల్పడడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో పేసర్ మహ్మద్ అమిర్ ఫిక్సింగ్ బూతం కారణంగా నిషేధానికి గురైన విషయం తెలిసిందే.
Basit Ali 🗣️
Shoaib Malik ne jaan bhoj k match harwaye hai i have proof
Usko mentor nahi banana chahye #PakistanCricket #BabarAzam𓃵 #ChampionsCup pic.twitter.com/PM0VyVK4N1— M Sultan Msd (@MSultanMsd) September 11, 2024
మూడేండ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన మాలిక్ ఫ్రాంచైజీ క్రికెట్లో దంచేస్తున్నాడు. మళ్లీ పాక్ జెర్సీ వేసుకోని దేశం తరఫున ఆడాలనే ఉద్దేశమే తనకు లేదని ఈమధ్యే చెప్పేశాడు. ప్రస్తుతం మాలిక్ చాంపియన్స్ వన్డే కప్(Champions One Day Cup)లో స్టాలిన్స్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. పాకిస్థాన్ గొప్ప ఆల్రౌండర్లలో ఒకడైమన మాలిక్ సుదీర్ఘ కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు.
ఇప్పటివరకూ మాలిక్ 35 టెస్టులు, 287 వన్డేలు, 124 టీ20లు ఆడాడు. 2021 నుంచి జాతీయ జట్టులో చోటు కోల్పోయిన మాలిక్ మళ్లీ గ్రీన్ జెర్సీ వేసుకోలేదు. ప్రస్తుతం అతడు పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL), బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(BPL), ఇతర ఇంటర్నేషనల్ లీగ్స్‌లో ఆడుతున్నాడు.
లేటు వయసులోనూ ఆటతో అదరగొడుతున్న మాలిక్ ఈ మధ్యే మూడో పెండ్లితో వార్తల్లో నిలిచాడు. అంతకంటే ముందు భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా(Sania Mirza)తో పదేండ్ల బంధాన్ని తెగతెంపులు చేసుకున్నాడు. సానియా నుంచి విడాకులు తీసుకున్న మాలిక్.. పాక్‌కు చెందిన సనా జావేద్(Sana Javed) అనే టీవీ నటితో నిఖా చేసుకున్నాడు.