Chennai Super Kings : భారత జట్టు మాజీ సారథుల్లో మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ఆల్‌టైమ్ గ్రేట్. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు తెచ్చిన ధోనీ ఇండియన్ ప్రీమియర్‌లోనూ కెప్టెన్‌గా రాణించాడు. రికార్డు స్థాయిలో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఫ్రాంఛైజీకి ఏకంగా ఐదు ట్రోఫీలు కట్టబెట్టిన ఘనత మహీ భాయ్‌దే. 18వ సీజన్లో ఈ దిగ్గజ ఆటగాడు బరిలోకి దిగడంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే మాజీ క్రికెటర్ బద్రీనాథ్(S Badrinath) సంచలన విషయం చెప్పాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్లో ధోనీ సీస్కేకు ఫస్ట్ చాయిస్ కాదని అన్నాడు.
టీ20 ఫార్మాట్లో అలజడి సృష్టించిన ఐపీఎల్ 2008లో మొదలైంది. తొలి సీజన్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదట ధోనీని కొనాలని అనుకోలేదట. అనూహ్యంగా చివరకు అతడికి దక్కించుకుంది అని బద్రీనాథ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ‘ఐపీఎల్ ఆరంభ సీజన్ వేలంలో సీఎస్కే ఫ్రాంచైజీ మొదట వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag)ను కొనాలని అనుకుంది.
ఎంఎస్ ధోనీ, బద్రీనాథ్
కానీ, ఢిల్లీ డేర్‌డెవిల్స్ వీరూను తన్నుకుపోయింది. దాంతో, చెన్నై యాజమాన్యం భారత్‌కు తొలి టీ20 వరల్డ్ కప్ అందించిన ధోనీపై గురి పెట్టింది. అప్పుడు సీఎస్కే ఫ్రాంచైజీ తరఫున ఆటగాళ్ల కొనుగోలులో వీబీ చంద్రశేఖర్(VB Chandrashekar) కీలక పాత్ర పోషించాడు. అతడే ధోనీనీ చెన్నై దక్కించుకునేలా చేశాడు. ఆ తర్వాత ధోనీ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ముఖచిత్రం అయ్యాడు’ అని బద్రీనాథ్ వెల్లడించాడు.
ఐపీఎల్లో ధోనీ సారథ్యంలో సీఎస్కే తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. 2010, 2011, 2018, 2021, 2023లో మహీ చెన్నైని విజేతగా నిలిపాడు. వయసు మీద పడడంతో 17వ సీజన్‌కు ముందు ధోనీ కెప్టెన్సీ వదులుకున్నాడు. యువకెరటం రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad)ను తన వారసుడిగా ప్రకటించి హుందాగా అతడికి పగ్గాలను అప్పగించాడు.