Port Blair renamed | పోర్ట్ బ్లెయిర్ పేరు.. ‘శ్రీ విజయ పురం’గా మార్పు
Port Blair renamed | అండమాన్, నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్పు చేసింది. శ్రీ విజయ పురం అని నామకరణం చేసినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం తెలిపారు. వలసవాద ముద్రల నుంచి దేశాన్ని విముక్తి చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తి, దార్శనికతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: అండమాన్, నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్పు చేసింది. (Port Blair renamed) శ్రీ విజయ పురం అని నామకరణం చేసినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం తెలిపారు. వలసవాద ముద్రల నుంచి దేశాన్ని విముక్తి చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తి, దార్శనికతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మన చరిత్ర, స్వాతంత్య్ర పోరాటంలో శ్రీ విజయ పురానికి ఎనలేని స్థానం ఉందని అమిత్ షా ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయానికి కూడా ఈ పేరు ప్రతీక అని అన్నారు. ‘మునుపటి పేరుకు వలస వారసత్వం ఉంది. మన స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయానికి, అండమాన్- నికోబార్ దీవుల విశిష్ట పాత్రకు శ్రీ విజయ పురం ప్రతీక’ అని పేర్కొన్నారు.
కాగా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేత మన తిరంగ (త్రివర్ణ) పతాకం మొదటి ఆవిష్కరణ జరిగింది ఇక్కడేనని అమిత్ షా తెలిపారు. అలాగే వీర్ సావర్కర్, ఇతర స్వాతంత్ర్య సమరయోధులు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సెల్యులార్ జైలు కూడా ఇదే అని అన్నారు. ‘మన చరిత్ర, స్వాతంత్ర్య పోరాటంలో అండమాన్, నికోబార్ దీవులకు అసమానమైన స్థానం ఉంది. ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి నావికా స్థావరంగా పని చేసిన ద్వీప భూభాగం నేడు మన వ్యూహాత్మక, అభివృద్ధి ఆకాంక్షలకు కీలకమైన స్థావరంగా ఉంది’ అని అమిత్ షా పేర్కొన్నారు.
మరోవైపు ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటీష్ కలోనియల్ నేవీ అధికారి కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ పేరుతో అండమాన్, నికోబార్ దీవుల రాజధానికి పోర్ట్ బ్లెయిర్‌గా నామకరణం చేశారు. అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళిగా ఇందులోని 21 దీవుల పేర్లను మారుస్తున్నట్లు 2018లో ప్రధాని మోదీ ప్రకటించారు. రాస్ ద్వీపం, నీల్ ఐలాండ్, హేవ్‌లాక్ ద్వీపాల పేర్లను నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్, షాహీద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్గా మార్పు చేశారు.
Inspired by the vision of PM @narendramodi Ji, to free the nation from the colonial imprints, today we have decided to rename Port Blair as “Sri Vijaya Puram.”
While the earlier name had a colonial legacy, Sri Vijaya Puram symbolises the victory achieved in our freedom struggle…
— Amit Shah (@AmitShah) September 13, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

