ముంబై: పాకిస్థాన్ క్రికెట్(Pakistan Cricket) బోర్డు పోస్టు చేసిన ఓ ప్రోమో వీడియో వివాదాస్పదంగా మారింది. వరల్డ్‌కప్ ప్రిపరేషన్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు పాక్‌లో పర్యటించనున్నది. ఈ నేపథ్యంలో ఆ రెండు జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ఆ సిరీస్‌ను ప్రమోట్ చేసేందుకు పాక్ క్రికెట్ బోర్డు ఓ ప్రోమో వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియోలో చివరి సీన్లు వివాదాస్పదంగా ఉన్నాయి. ఆసీస్‌తో సిరీస్ సందర్భంగా ఆ దేశ అభిమాని ఒకరు పాక్‌కు వెళ్తారు. ఆ తర్వాత ఓ కారులో అతను మ్యాచ్ చూసేందుకు వెళ్తాడు. కారు దిగిన తర్వాత ఆ ఆస్ట్రేలియా అభిమాని డ్రైవర్‌కు హ్యాండ్‌షేక్ ఇవ్వకుండానే ముందుకు కదిలిపోతాడు. షేక్‌హ్యాండ్ ఇవ్వడం మరిచిపోయావా, బహుశా పొరుగు దేశం వద్దే ఆగిపోయినట్లు ఉన్నావని ఆ టూరిస్టుతో డ్రైవర్ అంటాడు. ఆ వీడియోలో పాక్ ప్లేయర్ ఆఘా గఆతిథ్యం గురించి వివరిస్తాడు.
ఇండియాను టార్గెట్ చేస్తూ ఆ ప్రోమో వీడియోను రూపొందించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పెహల్గామ్ దాడి తర్వాత ఇండియా, పాక్ దేశాల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో ఇరు దేశాల కెప్టెన్లు కరాచలనం చేసుకోలేదు. ఆసియాకప్ టోర్నీలో కెప్టెన్ సూర్య పాక్ క్రికెటర్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. దాదాపు మూడు సందర్భాల్లో రెండు దేశాల మద్య ఈ పరిస్థితి ఎదురైంది. షేక్‌హ్యాండ్ ఇవ్వలేదని టోర్నీ నుంచి కూడా నిష్క్రమిస్తామని పాక్ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆసీస్‌తో సిరీస్ ఉన్న నేపథ్యంలో రూపొందించిన ప్రోమోలో పాక్ ఆ అంశాన్ని ఎత్తిచూపే ప్రయత్నం చేసింది. పాకిస్థాన్ రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్నట్లు ఆన్లైన్లో విమర్శలు వస్తున్నాయి.
Pakistan cricket board release #PakvsAus promo..#handshake #indvsnzt20 pic.twitter.com/96UHkFnjQt
— Haral (@FakharHaral) January 22, 2026