Champions Trophy | కరాచీ: వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో హైబ్రిడ్ మోడల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎట్టకేలకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్‌కు వెళ్లే ప్రసక్తే లేదని భారత్ తేల్చి చెప్పడంతో హైబ్రిడ్ మోడల్ అనివార్యమైంది.
దీంతో టీమ్ఇండియా ఆడే మ్యాచ్‌లను యూఏఈ వేదికగా నిర్వహించే అవకాశముంది. చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్ వచ్చే వారం విడుదలవనున్నట్టు పీసీబీ వర్గాల సమాచారం.