T20 World Cup | దుబాయ్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ సెమీస్‌కు దూసుకెళ్లింది. సోమవారం దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 54 పరుగుల తేడాతో గెలిచి గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా తర్వాత సెమీస్ చేరిన రెండో జట్టుగా నిలిచింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 110 పరుగులే చేయగలిగింది. సూజీ బేట్స్ (28) టాప్ స్కోరర్. పాక్ బౌలర్లలో నశ్రా సంధు (3/18) కివీస్‌ను కట్టడిచేసింది. కానీ స్వల్ప ఛేదనలో పాక్.. 11.4 ఓవర్లలో 54 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ఫాతిమా సనా (21), ఓపెనర్ మునీబా అలీ (15) మినహా మిగిలినవారంతా సింగిల డిజిట్‌కే పరిమితమయ్యారు. అమేలియా కెర్ (3/14), ఎడెన్ కార్సన్ (2/7) పాక్ పనిపట్టారు. ఈ మ్యాచ్‌లో పాక్ ఓడటంతో టోర్నీ నుంచి భారత్ నిష్క్రమించింది.