ENG vs PAK | ముల్తాన్: బ్యాటర్లు శతకాలతో విజృంభించడంతో ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ 556 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓవర్ నైట్ స్కోరు 328/4 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన పాక్కు అఘా సల్మాన్ (104 నాటౌట్) మరో శతకం బాదగా సౌద్ షకీల్ (82) రాణించాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. రెండో ఓవర్లోనే కెప్టెన్ ఓలీ పోప్ (0) వికెట్ను కోల్పోయినా జాక్ క్రాలే (64 బ్యాటింగ్), జో రూట్ (32 బ్యాటింగ్) దూకుడుతో ఇంగ్లండ్ ఒక వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది.