Pakistan Cricketers : స్వదేశంలో వెస్టిండీస్ సిరీస్‌కు సిద్ధమవుతున్న పాకిస్థాన్ జట్టు(Pakistan Team)కు పెద్ద షాక్. కెప్టెన్‌తో పాటు మరొకరు కారు యాక్సిడెంట్‌కు గురయ్యారు. ఈ సంఘటనలో మహిళా జట్టు కెప్టెన్ బిస్మాహ్ మహ్రూఫ్(Bismah Mahroof), స్టార్ స్పిన్నర్ గులాం ఫాతిమా(Gulam Fatima)లకు చిన్నపాటి గాయాలయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కారు యాక్సిడెంట్ తర్వాత బిస్మాహ్, ఫాతిమాలకు ప్రథమ చికిత్స చేశారు.
ప్రస్తుతం వీళ్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. బిస్మాహ్, గులాంల గురించి పీసీబీ అప్డేట్ ఇచ్చింది. ఈ ఇద్దరూ ఏప్రిల్ 5 సాయంత్రం కారు యాక్సిడెంట్లో గాయపడ్డారు. బిస్మాహ్, ఫాతిమాలు వెస్సటిండీస్ పర్యటనకు ఎంపికయ్యారు. ఏప్రిల్ 18 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది అని పీసీబీ వెల్లడించింది.
📸 Scenario-based practice match for the Pakistan women’s team as they prepare for the #PAKWvWIW series 🏏#BackOurGirls pic.twitter.com/PjxvU9kTa2
— Pakistan Cricket (@TheRealPCB) April 6, 2024
పాక్‌గడ్డపై వెస్టిండీస్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లకు పాకిస్థాన్‌కు ఎంతో కీలకం. ఈ ఏడాది బంగ్లాదేశ్ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024) సన్నాహకాలుగా ఈసిరీస్ పాకిస్థాన్‌కు ఉపయోగపడునుంది. ఇలాంటి సమయంలో ఇద్దరు స్టార్ క్రికెటర్లు గాయపడడం పాక్ జట్టును కలవరపెడుతోంది. సిరీస్ ఆరంభాని కల్లా బిస్మాహ్, ఫాతిమాలు కోలుకుంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.