క్రికెట్ ఆట అభిమానులను ఆటగాళ్లను కొన్నిసార్లు ఆనందంలో ముంచేస్తుంది. అదే సమయంలో కొన్నిసార్లు అంతులేని విషాదంలోకి నెట్టేస్తుంది. ఒక జట్టు గెలిస్తే మరో జట్టు ఓడిపోక తప్పదు కదా. టీ20 ప్రపంచకప్‌లో కూడా అదే జరిగింది. టోర్నీ ఆరంభంలో రెండుసార్లు పొట్టి ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ జట్టు.. కనీసం సూపర్-12లోకి కూడా రాకుండానే ఇంటి దారి పట్టడం అందరికీ షాకిచ్చింది.
తాజాగా పాకిస్తాన్‌ను జింబాబ్వే ఓడించడం కూడా అలాంటిదే. ఈ మ్యాచ్‌లో సంచలన విజయం సాధించిన జింబాబ్వే జట్టు, వారి అభిమానులు ఆనందంతో ఎగిరి గంతులు వేస్తున్నారు. అదే సమయంలో పాకిస్తాన్ జట్టు, ఆ జట్టు అభిమానులు విషాదంలో మునిగిపోయింది. పాక్ స్టార్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ ఈ పరాజయాన్ని తట్టుకోలేక ఏడ్చేశాడు.
జింబాబ్వేను 130 పరుగులకు కట్టడి చేసిన పాక్.. లక్ష్యాన్ని ఛేజ్ చెయ్యలేక చతికిలపడింది. ఈ ఘోర ఓటమితో షాదాబ్ మోకాళ్లపై కూర్చొని ఏడుస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతన్ని లేపి ఓదార్చిన పాక్ బృందంలోని వ్యక్తి.. షాదాబ్‌ను పక్కకు పంపించాడు.
Cricket can be so cruel sometimes.🫣😨 pic.twitter.com/dY5VXrlddM
— Avinash Aryan (@AvinashArya09) October 28, 2022