షార్జా: పాక్ స్పిన్నర్ షాదాబ్ విజృంభించాడు. స్కాట్లాండ్పై ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. 11వ ఓవర్లో బంతి అందుకున్న అతను తొలి బంతికే జార్జ్ మున్సే (17)ను అవుట్ చేశాడు. షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బాల్ సరిగా కనెక్ట్ కాలేదు. దీంతో గాల్లోకి లేచి బంతిని హారిస్ రౌఫ్ సులభంగా అందుకున్నాడు.
అప్పుడే క్రీజులోకి వచ్చిన డిలాన్ బడ్జ్ను ఆ తర్వాత మూడో బంతికే బౌల్డ్ చేశాడు. ప్రస్తుతానికి 11 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్ 42 పరుగులు చేసింది.