Womens T20 World Cup : భారత్, పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతినడంతో ఇరుజట్లు ఈమధ్య కాలంలో తటస్ఠ వేదికపైనే ఆడుతున్నాయి. ఇప్పటికే ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో విదేశీ గడ్డపై తలపడ్డాయి దాయాది టీమ్స్. తొలిసారి నిర్వహిస్తున్నమహిళల అంధుల టీ20 ప్రపంచ కప్(Blind Womens T20 World Cup 2025)లోనూ పాక్ జట్టు మ్యాచ్‌లను పరాయి నేలకు తరలించింది భారత్.
భారత్, శ్రీలంక వేదికగా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పాక్ మ్యాచ్‌లను కొలంబోలో ఆడిస్తామని మంగళవారం భారత అంధుల క్రికెట్ సంఘం(CABI) వెల్లడించింది. వర్చువల్ మీటింగ్‌లో ఈ ప్రతిపాదనకు ప్రపంచ అంధుల క్రికెట్ మండలి (WBCC) అమోదం తెలిపింది. తొలి సీజన్ అంధుల మహిళల వరల్డ్ కప్ పోటీలకు మొదటగా భారత్, నేపాల్ ఆతిథ్య హక్కులు దక్కించుకున్నాయి. ఢిల్లీ, బెంగళూరుతో పాటు ఖాఠ్మాండ్లో మ్యాచ్‌లు జరపాలని నిర్ణయించారు. కానీ.. నేపాల్‌లో ఇటీవల చెలరేగిన జెన్ జెడ్ నిరసనలు, ప్రభుత్వ మార్పు.. కారణంగా శ్రీలంకను కో హోస్ట్‌గా చేర్చారు.
India has announced a 16-member squad for the first-ever 𝐖𝐨𝐦𝐞𝐧’𝐬 𝐓𝟐𝟎 𝐖𝐨𝐫𝐥𝐝 𝐂𝐮𝐩 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐁𝐥𝐢𝐧𝐝.
The tournament, scheduled from November 11-25, comprises 21 league matches and two semi-finals, followed by the final.
It will feature Australia, England,… pic.twitter.com/LkHrop3NG2
— All India Radio News (@airnewsalerts) September 11, 2025
నవంబర్ 11 నుంచి 25 వరకూ ఈ మెగా టోర్నీ జరుగనుంది. 21 లీగ్ మ్యాచ్‌లు, రెండు సెమీ ఫైనల్స్ తర్వాత టైటిల్ పోరు ఉంటుంది. మహిళల అంధుల పొట్టి ప్రపంచ కప్ మొదటి ఎడిషన్‌లో ఏడు జట్లు పోటీపడనున్నాయి. ఆతిథ్య భారత్, శ్రీలంకతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక, యూఎస్ఏ టీమ్‌లు టైటిల్ కోసం బరిలోకి దిగునున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం ఇదివరకే దీపికా టీసీ కెప్టెన్‌గా 16 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది భారత అంధుల క్రికెట్ సంఘ.