Salman Agha : పదో సీజన్ టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. లీగ్ దశలో టీమిండియాతో ఆడబోమని పాక్ ప్రభుత్వం తేల్చిచెప్పడంతో ఫిబ్రవరి 15న దాయాదుల మ్యాచ్ సందేహమే అనిపిస్తోంది. ఇదే విషయంపై పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాను విలేకరులు ప్రశ్నించగా అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాయ్‌కాట్ నిర్ణయం తమది కాదని, ప్రభుత్వం చెప్పినట్టు వినడం తప్ప ఏమీ చేయలేమని అతడు వెల్లడించాడు.
భారత్‌లో వరల్డ్‌ప్ ఆడబోమని పంతం పట్టిన బంగ్లాదేశ్‌పై వేటు పడగా.. ఇప్పుడు పాకిస్థాన్ అదే తీరుగా వ్యవహరిస్తోంది. లీగ్ దశలో ఫిబ్రవరి 15న కొలంబోలో టీమిండియాతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నామని ఆ దేశం స్పష్టం చేసింది. అయితే.. ఎంచుకొని మ్యాచ్‌లు ఆడడాన్ని సహించమని పీసీబీని ఐసీసీ హెచ్చరించింది. అయినా సరే పాక్ బోర్డు మాత్రం స్పందించలేదు. వరల్డ్‌కప్ కోసం సోమవారం పాక్ జట్టు శ్రీలంకకు బయల్దేరింది. జెర్సీ ఆవిష్కరణ అనంతరం కెప్టెన్ సల్మాన్ అఘా మీడియాతో మాట్లాడాడు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ ఇది మా నిర్ణయం కాదు..మేము ఏమీ చేయలేం అని బదులిచ్చాడు.
🗣️ ‘It’s not our decision. We can’t do anything’
Salman Agha on Pakistan boycotting their T20 World Cup match against India pic.twitter.com/KpY0Y5ASW4
— ESPNcricinfo (@ESPNcricinfo) February 2, 2026
‘వరల్డ్‌కప్‌లో ప్రతి మ్యాచ్ కీలకమే. మేము మూడు లీగ్ మ్యాచ్‌లు గెలవాలనుకుంటున్నాం. మేము ప్రపంచకప్ ఆడేందుకు వెళ్తున్నాం. అయితే.. భారత జట్టుతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలనేది మా నిర్ణయం కాదు. మేము ఏం చేయలేం. మా ప్రభుత్వం, పీసీబీ ఛైర్మన్ ఆదేశాలను మేము పాటించాల్సి ఉంటుంది. మేము అదే చేస్తాం. ఇక వరల్డ్‌కప్‌లో ప్రతి మ్యాచ్ ముఖ్యమైనదే. తొలి రౌండ్లో మేము మూడు మ్యాచ్‌లు ఆడుతాం. మూడుకు మూడు కీలకమే. అందుకని ఈ మూడు మ్యాచ్‌లను మేము తేలికగా తీసుకోము’ అని సల్మాన్ అఘా వెల్లడించాడు.
🚨🚨PAKISTAN OFFICIALLY BOYCOTTED MATCH AGAINST INDIA 🚨🚨#INDvsPAK pic.twitter.com/tZ12dfaoFn
— Bemba Tavuma 🐐 (@gaandfaadtits) February 1, 2026
షెడ్యూల్ ప్రకారం లీగ్ దశలో భారత జట్టు ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో తలపడాలి. కానీ, ఇండియాతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని పాక్ ప్రభుత్వం ప్రకటించడంతో దాయాదుల బిగ్ ఫైట్ చూడాలనుకున్న కోట్లాదిమంది షాక్ అవుతున్నారు. అయితే.. బీసీసీఐ మాత్రం పాక్ ప్రభుత్వ నిర్ణయాన్ని తేలికగానే తీసుకుంది. తాము ఐసీసీ ప్రొటోకాల్ పాటిస్తామని, షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న భారత జట్టు కొలంబో స్టేడియానికి వెళ్తుందని సోమవారం బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
🚨 BCCI’S BIG UPDATE ON IND VS PAK MATCH 🚨
– India will travel to Sri Lanka on 15th February and follow ICC protocol. They will practice, do a press conference and reach the stadium and wait for the match referee to call off the match
What’s your take🤔pic.twitter.com/IA7XwjyFIK
— Richard Kettleborough (@RichKettle07) February 2, 2026