IND vs PAK : ఐసీసీ టోర్నమెంట్ ఏదైనా భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. పురుషుల జట్లైనా, మహిళల టీమైనా నువ్వానేనా అంటూ తలపడడం అభిమానులకు భలే కిక్కిస్తుంది. ఈసారి మహిళల టీ20 ప్రపంచకప్‌లో మరోసారి దాయాదులు తాడోపేడో తేల్చుకోనున్నాయి. లీగ్ దశలో చిరకాల మ్యాచ్ గురించి పాక్ కెప్టెన్ ఫాతిమా సనా(Fatima Sana) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అందరూ ఊహిస్తున్నట్టు ఇండియాతో మ్యాచ్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వబోవని ఫాతిమా పేర్కొంది.
టీ20 ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా పాకిస్థాన్ జట్టు లాహార్లో శిక్షణ శిబిరంలో బిజీగా ఉంది. జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌తో జరుగనున్న మ్యాచ్‌కు ఎలా సన్నద్ధమవుతున్నారు? అని కెప్టెన్ సనా ఫాతిమాను మీడియా ప్రశ్నించగా ఆమె ‘అదేం లేదు.. ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనుకోవడం లేదు’ అని చెప్పింది. మేము ప్రపంచకప్ కోసం బాగా సన్నద్ధమయ్యాం.
వరల్డ్‌కప్‌లో ప్రతి మ్యాచ్ ముఖ్యమే. టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. అందుకని మేము ఒక మ్యాచ్ కోసం ప్రత్యేకంగా సిద్దమవ్వడం లేదు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. దేవుడి ఆశీర్వాదంతో మేము మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నాం అని ఫాతిమా వెల్లడించింది.
Fatima Sana breaks the record for the fastest 50 in women’s T20Is 🔥
Devine, Litchfield and Ghosh held the joint record previously in 18 balls pic.twitter.com/jCbSbd7dur
— ESPNcricinfo (@ESPNcricinfo) May 15, 2026
ఇటీవలే స్వదేశంలో జింబాబ్వేను వైట్‌వాష్ చేసిన పాకిస్థాన్ ప్రపంచకప్ పోటీలకు ఆత్మవిశ్వాసంతో రానుంది. కెప్టెన్ ఫాతిమా 15 బంతుల్లోనే వేగవంతమైన అర్ధ శతకతో రికార్డు నెలకొల్పింది కూడా. వరల్డ్‌కప్ ముందు ఐర్లాండ్, వెస్టిండీస్‌తో పాక్ ముక్కోణపు సిరీస్ ఆడనుంది. జూన్ 12 నుంచి మొదలయ్యే పొట్టి కప్‌లో భారత్, పాక్ గ్రూప్ ఏలో ఉన్నాయి. లీగ్ దశలో ఇరజట్లు జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్‌లో తలపడనున్నాయి. రికార్డు గమనిస్తే.. టీ20 వరల్డ్‌కప్‌లో పాక్‌పై టీమిండియాదే పైచేయి. ఇప్పటివరకూ 16 మ్యాచుల్లో భారత్ 13సార్లు దాయాదిని చిత్తు చేసింది.