శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sports - Oct 18, 2020 , 00:50:36

క్రికెట్‌కు ఉమర్‌ గుల్‌ గుడ్‌బై

క్రికెట్‌కు ఉమర్‌ గుల్‌ గుడ్‌బై

కరాచీ: పాకిస్థాన్‌ సీనియర్‌ పేసర్‌ ఉమర్‌ గుల్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2016 తర్వాతి నుంచి పాక్‌ జట్టు తరఫున ఆడని 36 ఏండ్ల గుల్‌.. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం ప్రకటించాడు. ‘దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్విస్తున్నా. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’అని గుల్‌ పేర్కొన్నాడు. 2003లో జింబాబ్వేపై అరంగేట్రం చేసిన గుల్‌.. 47 టెస్టుల్లో 163, 130 వన్డేల్లో 179, 60 టీ20ల్లో 85 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో ఉమర్‌ గుల్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.