హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో ఉస్మానియా మహిళల టెన్నిస్ జట్టు జోరు కొనసాగుతున్నది. శనివారం జరిగిన సెమీఫైనల్ పోరులో ఉస్మానియా 2-0 తేడాతో హేమచంద్రాచార్య నార్త్ గుజరాత్ యూనివర్సిటీపై విజయం సాధించింది. తొలుత జరిగిన సింగిల్స్‌లో ఓయూ కెప్టెన్ రష్మిక 6-1, 6-1తో హెర్వే చౌదరిపై అలవోకగా గెలిచింది. మరో పోరులో సాత్విక 6-0, 6-0తో కుమార్ పటేల్‌ను చిత్తుగా ఓడించింది.