MI vs LSG | రోహిత్, రికెల్టన్ అర్ధశతకాల జోరు.. ముంబైకి మూడో విజయం..!
MI vs LSG : వాంఖడే పరుగుల వరదతో.. సిక్సర్ల మోతతో దద్దరిల్లింది. కానీ, ఈసారి ముంబై ఇండియన్స్ ప్రత్యర్థికి అవకాశమివ్వలేదు. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లకు దాసోహమైన చోటే సగర్వంగా జట్టును గెలిపించారు.
MI vs LSG : వాంఖడే పరుగుల వరదతో.. సిక్సర్ల మోతతో దద్దరిల్లింది. కానీ, ఈసారి ముంబై ఇండియన్స్ ప్రత్యర్థికి అవకాశమివ్వలేదు. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లకు దాసోహమైన చోటే సగర్వంగా జట్టును గెలిపించారు. నికోలస్ పూరన్(63) విధ్వంసంతో లక్నో 229ని లక్ష్యంగా నిర్దేశించగా రోహిత్ శర్మ(84), రికెల్టన్(83)లు తమ తడాఖా చూపిస్తూ శతక భాగస్వామ్యంతో చెలరేగారు. కసికొద్ది ఆడిన ఇద్దరూ సగం ఓవర్లలోనే మ్యాచ్ గమనాన్ని మార్చేశారు. నమర్ ధిర్ (23 నాటౌట్) లాంఛనం పూర్తి చేసి ముంబైకి మూడో విజయం కట్టబెట్టాడు.
పంతొమ్మిదో సీజన్లో పేలవమైన ఆటతో అట్టడుగున నిలిచిన ముంబై, లక్నో మ్యాచ్‌లో.. ముంబై జయభేరి మోగించింది. తొలుత బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఇంప్యాక్ట్ సబ్ రోహిత్ శర్మ(84), రికెల్టన్(83) వీరబాదుడుతో సగం ఓవర్లకే లక్ష్యాన్ని కరిగించేశారు. ఈ ఇద్దరూ పోటీపడి బౌండరీలు బాదగా.. లక్నో బౌలర్లు, ఫీల్డర్లు కుదేలయ్యారు. రికెల్టన్, రోహిత్ దూకుడుతో వడివడిగా గెలుపు దిశగా సాగింది ముంబై.
143 రన్స్‌తో..
లక్నో నిర్దేశించిన భారీ ఛేదనలో ముంబై ఇండియన్స్ ఓపెనర్లు తగ్గేదేలే అన్నట్లు ఆడారు. ఇంప్యాక్ట్ సబ్‌గా వచ్చిన రోహిత్ శర్మ(84) తన మార్క్ విధ్వంసంతో అలరించిగా.. రికెల్టన్(83) వీరకొట్టుడుతో లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. 8.1 ఓవర్లలోనే వీరిద్దరూ స్కోర్ 100 దాటించారు. మ్యాచ్‌ను లాగేసుకుంటున్న ఈ ద్వయాన్ని విడదీసి లక్నోకు బ్రేకిచ్చాడు. దాంతో.. 143 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
A knock that had the Wankhede roaring for more 💙
🎥 Ryan Rickelton made it look too easy out there 👏
Updates ▶️ https://t.co/elXSOvaeig #TATAIPL | #KhelBindaas | #MIvLSG pic.twitter.com/NL2QJ0ePRK
— IndianPremierLeague (@IPL) May 4, 2026
ఎడాపెడా ఉతికేస్తున్న హిట్‌మ్యాన్‌ను సిద్ధార్థ్ ఔట్ చేసినా అప్పటికే ముంబై గెలుపు వాకిట నిలిచింది. అనంతరం.. తిలక్ వర్మ(11), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(12)లు వెనుదిరిగినా.. నమన్ ధిర్(23 నాటౌట్), విల్ జాక్స్(10 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా ముంబైని విజయ తీరాలకు చేర్చారు. 9 మ్యాచుల్లో ఏడో ఓటమితో రిషభ్ పంత్ సేన ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది.
పూరన్ పిడుగల్లే..
టాస్ ఓడిన లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోర్‌తో ముంబైకి సవాల్ విసిరింది. వాంఖడే స్టేడియంలో ఓపెనర్ జోష్ ఇంగ్లిస్(13) విఫలమైనా.. మిచెల్ మార్ష్(44) జతగా నికోలస్ పూరన్(63 21 బంతుల్లో ఫోర్, 8 సిక్సర్లు) ముంబై బౌలర్లపై పిడుగల్లే పడ్డాడు. ఈ సీజన్లో తొలిసారి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన పూరన్ 16 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. కెప్టెన్ పంత్(15) మరోసారి తేలిపోగా.. మర్క్రమ్(31 నాటౌట్), హిమ్మత్ సింగ్(40 నాటౌట్)లు దూకుడు కొనసాగించగా లక్నో స్కోర్ రెండొందలు దాటింది. సమిష్టిగా రాణించగా లక్నో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు కొట్టింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

