IPL 2026 Auction : ప్రతిభావంతులైన క్రికెటర్లపై కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ వేలాని(IPL 2026 Auction)కి సమయం దగ్గరపడుతోంది. డిసెంబర్ 16న అబుధాబీలో మినీ వేలం నేపథ్యంలో ఫ్రాంచైజీలు మ్యాచ్ విన్నర్లను కొనేందుకు సన్నద్ధమవుతున్నాయి. సర్వత్రా ఆసక్తి రేపుతున్న పంతొమ్మిదో సీజన్ కోసం 1,355 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. రూ.2 కోట్ల ధరలో 45 మంది ఉండగా.. వీరిలో ఇద్దరు భారత క్రికెటర్లే ఉండడం గమనార్హం. మినీ వేలంలో నిలిచిన ఆటగాళ్ల వివరాలను నిర్వాహకులు మంగళవారం ప్రకటించారు. అన్క్యాప్డ్ ఇండియన్ క్రికెటర్లు 928 మంది వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
మహిళల ప్రీమియర్ లీగ్ వేలం ముగియడంతో ఐపీఎల్ వేలంపై అందరూ దృష్టి సారిస్తున్నారు. ఈసారి వేలంలో భారీ ధర పలికేది ఎవరు? ఏ ఫ్రాంచైజీ ఎవరిని కొంటుంది? వంటి విషయాలు జోరుగా చర్చిస్తున్నారు. వేలానికి మరో రెండు వారాలే ఉన్నందున మంళవారం ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ నిర్వాహకులు విడుదల చేవారు. ఈ దఫా 1,355 మంది వేలంలో నిలవగా.. రూ.2 కోట్ల కనీస ధరకు పేర్లు నమోదు చేసుకున్నవాళ్లు 45 మంది ఉన్నారు.
ఆశ్చర్యంగా వీరిలో భారత్ నుంచి ఇద్దరికి మాత్రమే చోటు దక్కింది. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్(Ravi Bishnoi), పవర్ హిట్టర్ వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer) మాత్రమే రెండు కోట్ల క్లబ్లో ఉన్నారు. ఐపీఎల్ వేలానికొస్తున్న ఇతర దేశాల ఆటగాళ్లు.. రూ.2 కోట్ల ధరలో ఉన్న క్రికెటర్ల వివరాలు చూద్దాం.

మినీ వేలం కోసం రూ.2 కోట్ల కనీస ధరకు పేర్లు నమోదు చేసుకున్న వారిలో ఈసారి విదేశీయులే అధికం. భారత్ నుంచి రవి బిష్ణోయ్, వెంకటేశ్ అయ్యర్ మాత్రమే ఈ బేస్ ప్రైజ్‌లో నిలిచారు. న్యూజిలాండ్ నుంచి అత్యధికంగా 10 మంది, ఇంగ్లండ్ క్రికెటర్లు 9 మంది.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఏడుగురు రూ.2 కోట్ల ధరతో వేలంలోకి వస్తున్నారు. శ్రీలంక, వెస్టిండీన్ ఆటగాళ్లు నలుగురు, అత్యల్పంగా బంగ్లాదేశ్ నుంచి ఒక్కరు మాత్రమే ఈ కనీస ధరతో రిజిష్టర్ అయ్యారు.
ఇంగ్లండ్ – బెన్ డకెట్, లివింగ్‌స్టోన్, టైమల్ మిల్స్, జేమీ స్మిత్. గస్ అట్కిన్సన్, టామ్ బ్యాంటన్, టామ్ కరన్, లియాం డాసన్, డానియెల్ లారెన్స్,
న్యూజిలాండ్ – రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్,జాకబ్ డఫ్ఫీ, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, ఆడమ్ మిల్నే, విలియం ఓ రూర్కీ.
Here is the full list of players who have set a base price of ₹2 crore for the IPL 2026 mini-auction. 🏆
Who will be the highest-paid player from this list? 👀
(Source – ESPN Cricinfo)#Cricket #IPL2026 #BCCI pic.twitter.com/48EJapvVep
— Sportskeeda (@Sportskeeda) December 2, 2025
ఆస్ట్రేలియా – కామెరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, స్టీవ్ స్మిత్, సీన్ అబాట్, అష్టన్ అగర్, బెన్ కట్టింగ్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్.
దక్షిణాఫ్రికా – డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, రీలే రస్సో, గెరాల్డ్ కొయెట్జీ, అన్రిజ్ నోర్జీ, తబ్రేజ్ షంసీ, డేవిడ్ వీస్.
శ్రీలంక – వనిందు హసరంగ, మథీశ పథిరన, మహీశ్ థీక్షణ.
వెస్టిండీస్ – జేసన్ హోల్డర్, షాయ్ హోప్, అకీల్ హొసేన్, అల్జారీ జోసెఫ్.
అఫ్గనిస్థాన్ – ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్.
బంగ్లాదేశ్ – ముస్తాఫిజుర్ రెహ్మాన్.
పంతొమ్మిదో సీజన్ కోసం ఫ్రాంచైజీలు మొత్తంగా 173 మందిని అట్టిపెట్టుకున్న విషయం తెలిసిందే. వీరిలో 49 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. ఈసారి ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ భారీ సంఖ్యలో రీటైన్ చేసుకున్నాయి. కాబట్టి.. వేలంలో 77 మంది మాత్రమే అమ్ముడుపోయే అవకాశముంది.
The retentions are locked in! 🥳
Presenting the retained players of all the teams ahead of #TATAIPLAuction 2026! 🙌
What do you make of your team’s combination 🤔🔢#TATAIPL pic.twitter.com/SYvak6e123
— IndianPremierLeague (@IPL) November 15, 2025
అబుధాబీలో జరుగబోయే మినీ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు రూ.237.55 కోట్లు ఖర్చు చేయనున్నాయి. వీటిలో కోల్‌కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా రూ. 64.3కోట్లు ఉన్నాయి. వేలంలో పదమూడు మందిని కొనేందుకు కోల్‌కతా కసరత్తు చేస్తోంది. ఇందులో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు ఉండే అవకాశముంది. రెండో అత్యధిక బడ్జెట్ చెన్నై సూపర్ కింగ్స్ వద్ద ఉంది. సీఎస్కే రూ.43.4 కోట్లతో వేలంలో పాల్గొననుంది. ముంబై ఇండియన్స్ దగ్గర రూ.2.75 కోట్లు ఉన్నాయంతే. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ పర్స్‌లో రూ.11.5 కోట్లు ఉన్నాయి. పంతొమ్మిదో సీజన్ కోసం ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే..
కోల్‌కతా నైట్ రైడర్స్ : అజింక్యా రహానే, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకుల్ రాయ్, మనీశ్ పాండే, రమన్‌దీప్ సింగ్, రింకూ సింగ్, రొవ్మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
చెన్నై సూపర్ కింగ్స్ : ఎంఎస్ ధోనీ, జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, నాథ్ ఎల్లిస్, అన్షుల్ కంబోజ్, ముకేశ్ చౌదరీ, రామక్రిష్ణ, ఘోష్, సంజూ శాంసన్(ట్రేడ్ డీల్), రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, శ్రేయాస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఉర్విల్ పటేల్.
లక్నో సూపర్ జెయింట్స్ : రిషభ్ పంత్, మర్క్రమ్, హిమ్మత్, అర్జున్ టెండూల్కర్, షమీ (ట్రేడ్ డీల్), ఆయుశ్ బదొని,మిచెల్ మార్ష్, అబ్దుల్ సమద్, షాబాద్, అర్షిన్, అవేశ్, సిద్ధార్థ్, దిగ్వేజ్, ప్రిన్స్, మయాంక్ , మొహ్సిన్.
ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, దుష్మంత్ చమీర, అభిషేక్ పొరెల్, అజయ్ మండల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అశుతోష్ శర్మ, మద్వా తివారీ, మిచెల్ స్టార్క్, ముకేశ్ కుమార్, నితీశ్ రానా(ట్రేడ్ డీల్), సమీర్ రిజ్వీ, త్రిపురన విజయ్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, టి.నటరాజన్.
Here’s a look at the remaining purse of all 🔟 teams ahead of the #TATAIPLAuction 2026 👀
How is your team placed heading into the auction? 🤔#TATAIPL pic.twitter.com/1xKSPuwTLe
— IndianPremierLeague (@IPL) November 16, 2025
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్, హేజిల్‌వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్, నువాన్ తుషార, రసిక్ దార్ సలాం, సుయాశ్ శర్మ, అభినందన్ సింగ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, స్మరణ్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, హర్ష్ దుబే, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్సే, ప్యాట్ కమిన్స్, ఉనాద్కాట్, ఇషాన్ మలింగ, జీషన్ అన్సారీ.
పంజాబ్ కింగ్స్ : అట్టిపెట్టుకున్నది వీళ్లనే – శ్రేయాస్ అయ్యర్, చాహల్, అర్ష్‌దీప్ సింగ్, స్టోయినిస్, శశాంక్ సింగ్, నేహల్ వధేర, ప్రియాన్ష్ ఆర్య, పైలా అవినాశ్, హర్నూర్ పన్ను, హర్‌ప్రీత్ బ్రార్, ముషీర్ ఖాన్, ప్రభ్సిమ్రాన్ సింగ్, విష్ణు వినోద్, మార్కో యాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సూర్యాన్ష్ శెడ్గే, మిచెల్ ఓవెన్, వైషాక్ విజయ్ కుమార్, యశ్ ఠాకూర్, గ్జావియర్ బార్ట్లెట్, లాకీ ఫెర్గూసన్.
ముంబై ఇండియన్స్ : రీటైన్డ్ ప్లేయర్లు – రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రాబిన్ మింజ్, రియాన్ రికెల్టన్, హార్దిక్ పాండ్యా, నమన్ ధిర్, మిచెల్ శాంట్నర్, విల్ జాక్స్, కార్బిన్ బాస్చ్, రాజ్ బవ, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, దీపక్ చాహర్, అశ్వినీ కుమార్, రఘు శర్మ, గజన్ఫర్.
The wait is over and the retentions are 𝙃𝙀𝙍𝙀! 🔥
Here are all the players retained by the 🔟 teams ahead of the #TATAIPL Auction 💪
What do you make of the retention choices 🤔 pic.twitter.com/VCd0REe5Ea
— IndianPremierLeague (@IPL) October 31, 2024