చండీగఢ్: భారత మహిళల హాకీ జట్టు డిఫెండర్ గుర్జీత్ కౌర్ ఇంట్లో ఆమె కుటుంబసభ్యులు సంబురాలు చేసుకున్నారు. ఒకరికి ఒకరు స్వీట్లు పంచుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో ( Olympics ) ఈ ఉదయం జరిగిన మహిళల హాకీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. హోరాహోరి పోరులో ప్రత్యర్థి ఆస్ట్రేలియాను 1-0 తేడాతో ఓడించింది.
ఈ గెలుపులో పంజాబ్‌కు చెందిన డిఫెండర్ గుర్జీత్ కౌర్ కీలక పాత్ర పోషించారు. మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్ డిఫెండర్ గుర్జీత్ కౌర్ కొట్టిందే. అందుకే ఆమె కుటుంబం ఆనందంతో ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నది.
Punjab | Indian women's hockey team defender Gurjit Kaur's family exchange sweets at their home in Amritsar after the women's team reaches semi-finals for first time in Olympics
— ANI (@ANI) August 2, 2021
Defender Gurjit Kaur scored the lone goal in the quarter-finals against Australia to enter semis pic.twitter.com/A1oCDicoY0