భారత్‌లో ఒలింపిక్ కమిటీ సెషన్
దశాబ్దాల అనంతరం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) సెషన్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది ముంబై వేదికగా ఐవోసీ సమావేశం నిర్వహణకు భారత్ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది. 99 శాతం ఓట్లతో ముంబైకి ఈ మెగాచాన్స్ లభించింది
2023లో ముంబై వేదికగా..
40 ఏండ్ల తర్వాత సువర్ణావకాశం
ముంబై: దశాబ్దాల అనంతరం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) సెషన్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది ముంబై వేదికగా ఐవోసీ సమావేశం నిర్వహణకు భారత్ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది. 99 శాతం ఓట్లతో ముంబైకి ఈ మెగాచాన్స్ లభించింది. 1983లో తొలిసారి ఢిల్లీ వేదికగా ఈ సెషన్ జరగగా.. 40 ఏండ్ల తర్వాత 2023లో మరోసారి భారత్‌కు ఈ అవకాశం వచ్చింది. శనివారం బీజింగ్ వేదికగా జరిగిన కమిటీ సమావేశంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా, ఐవోసీ సభ్యురాలు నీతా అంబానీ పాల్గొన్నారు. ‘నలభైయేండ్ల తర్వాత భారత్‌కు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ సమావేశం నిర్వహించే అదృష్టం దక్కింది. 2023లో ముంబైలో ఈ సెషన్‌కు ఆతిథ్యం ఇవ్వడం గర్వంగా ఉంది. భారత్‌లోని యువత ఒలింపిక్స్ విశేషాలను తెలుసుకునేందుకు ఇది చక్కటి అవకాశం’అని ఐవోసీ సభ్యురాలు నీతా అంబానీ పేర్కొన్నారు.
సుదీర్ఘ విరామం అనంతరం భారత్‌కు ఈ అవకాశం దక్కడం హర్షనీయం. సమావేశ నిర్వహణ బిడ్ దక్కడానికి కృషి చేసిన వారికి కృతజ్ఞతలు. వచ్చే ఏడాది వేసవిలో జరిగే సదస్సులో 150 మందికిపైగా ఐవోసీ ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది.
– అర్శనపల్లి జగన్మోహన్రావు, జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

