Kapil Dev : భారత క్రికెట్ జట్టు మొదటిసారి వరల్డ్ కప్(World Cup) అందించిన ఘనడు కపిల్ దేవ్(Kapil Dev). లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో టీమిండయా డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్(Westindies)ను చిత్తు చేసి వరల్డ్ కప్‌ను ముద్దాడింది. అయితే.. ఫైనల్‌కు ముందే భారత జట్టుకు అసలైన పరీక్ష ఎదురైంది. 1983 జూలై 18న జరిగిన సెమీ ఫైనల్.. జింబాబ్వే(Zimbabwe) బౌలర్ల ధాటికి భారత జట్టు 50 పరుగుల లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన కపిల్ దేవ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.
ధనాధన్ ఆటతో కేవలం 138 బంతుల్లోనే 175 రన్స్ కొట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. ఈ హర్యానా హరికేన్ విధ్వంసక బ్యాటింగ్‌కు నేటితో 40 ఏళ్లు. ఈ సందర్భంగా బీసీసీఐ ట్విట్టర్లో కపిల్ దేవ్ ఫొటోను షేర్ చేసింది.
🗓️ #OnThisDay in 1983
📍Tunbridge Wells
Captain @therealkapildev slammed 16 fours & 6 sixes to hammer 1⃣7⃣5⃣* off 1⃣3⃣8⃣ balls against Zimbabwe in the 1983 World Cup 👏👏#TeamIndia pic.twitter.com/0FthfMKMuq
— BCCI (@BCCI) June 18, 2023
ఓపెనర్లు సునీల్ గావస్కర్(0), కృష్ణమాచారి శ్రీకాంత్(0) డకౌట్ అయ్యారు. ఆదుకుంటారనుకున్న మెహిందర్ అమర్నాథ్(5), సందీప్ పాటిల్(1) చేతులెత్తేశారు. కపిల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో భారత జట్టు జింబాబ్వే ముందు 266 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో జింబాబ్వే 235 పరుగులకే కుప్పకూలింది. మదన్‌లాల్ 3, రోజర్ బిన్ని రెండు వికెట్లతో చెలరేగారు. సంచలన ఆటతో భారత్‌కు భారీ స్కోర్ అందించిన కపిల్ దేవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. సెమీ ఫైనల్ విజయం ఇచ్చిన ఊపుతో టీమిండియా ఫైనల్లో వెస్టిండీస్‌ను మట్టికరిపించింది. తొలిసారి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది.