Ajinkya Rahane | మళ్లీ కౌంటీల్లో ఆడనున్న రహానే.. ఏ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడంటే..?
Ajinkya Rahane : భారత క్రికెట్లో అజింక్యా రహానే(Ajinkya Rahane) ఇప్పుడు ఒక సంచలనం. అవును.. దాదాపు కెరీర్ ముగిసింది అనుకున్న దశలో అతను జట్టుకు ఎంపికైన తీరు అమోఘం. సూపర్ ఫామ్లో ఉన్న అతను మళ్లీ కౌంటీ(County)ల్లో ఆడనున్నాడు. అవును.. వెస్టిండీస్ పర్యటనలో రెండు టెస్టులు ముగిశాక....
Ajinkya Rahane : భారత క్రికెట్లో అజింక్యా రహానే(Ajinkya Rahane) ఇప్పుడు ఒక సంచలనం. అవును.. దాదాపు కెరీర్ ముగిసింది అనుకున్న దశలో అతను జట్టుకు ఎంపికైన తీరు అమోఘం. దేశవాళీలో, ఐపీఎల్ 16వ సీజన్లో అద్భుతంగా రాణించి భారత జట్టులోకి వచ్చాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో(WTC Final 2023)నూ సత్తా చాటి తనలో చేవ తగ్గలేదని నిరూపించాడు. సూపర్ ఫామ్లో ఉన్న అతను మళ్లీ కౌంటీ(County)ల్లో ఆడనున్నాడు.
అవును.. వెస్టిండీస్ పర్యటనలో రెండు టెస్టులు ముగిశాక రహానే ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కనున్నాడు. అక్కడ లీసెస్టర్షైర్ (Leicestershire)జట్టు తరఫున కౌంటీ చాంపియన్షిప్(County Championship)లో బరిలోకి దిగబోతున్నాడు. భారత జట్టు విండీస్ పర్యటనలో రెండు టెస్టులు, మూడు వన్డేలు, 5 టీ 20లు ఆడనుంది. జూలై 12 ఇరుజట్లు తొలి టెస్టులో తలపడనున్నాయి.
అదృష్టం కంటే కష్టాన్నే
టీమిండియా జెర్సీ వేసుకోవడం కోసం రహానే అదృష్టం కంటే కష్టాన్నే నమ్ముకున్నాడు. అందుకనే రెండేళ్ల తర్వాత మళ్లీ అవకాశం అతడిని వెతుక్కుంటూ వచ్చింది. అందరూ ఇక అతడి కెరీర్ ముగిసినట్టే అనుకున్న దశలో రహనే తన బ్యాట్ పవర్ చూపించాడు. ఆకలిగొన్న సింహంలా దేశవాళీ లీగ్స్(Domestic Cricket)లో పరుగుల వరద పారించాడు. ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో అద్భుత ప్రదరన్శనతో ఏకంగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఆడే అవకాశం కొట్టేశాడు. చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీ గెలవడంలో రహానే పాత్ర ఉంది. టోర్నీ ఆసాంతం చెలరేగిన అతను ఫైనల్లో27 పరుగులతో రాణించాడు. మోహిత్ శర్మ వేసిన 20వ ఓవర్లో రవీంద్ర జడేజా(11 నాటౌట్) ఆఖరి రెండు బంతులకు సిక్స్, ఫోర్ కొట్టి చెన్నైను గెలిపించాడు.

గాయాన్ని లెక్కచేయకుండా..
ఓవల్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో సెలెక్టర్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని రహానే వమ్ము చేయలేదు. విరాట్ కోహ్లీ(Virat Kohli), ఛటేశ్వర్ పూజారా, రోహిత్ శర్మ చేతులెత్తేసిన చోట సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్లో 89 పరుగులతో ఆకట్టుకున్నాడు. బొటన వేలికి గాయం అయినా కూడా ఫాలో ఆన్ తప్పించేందుకు ఒంటరి పోరాటం చేశాడు. శార్ధూల్ ఠాకూర్(Shardhul Thakur)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండో ఇన్నింగ్స్లో కోహ్లీతో కలిసి విలువైన పరుగులు జోడించాడు. అయితే.. మిచెల్ స్టార్క్ అద్బుత బంతితో రహానేను వెనక్కి పంపాడు. ఆ తర్వాత భారత జట్టు ఆలౌట్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు. లియన్ 4 వికెట్లతో చెలరేగడంతో టీమిండియా 234కే కుప్పకూలింది. దాంతో, తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా టెస్టు గదను సొంతం చేసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

