ODI World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో అసలు సిసలు సమఉజ్జీల పోరుకు రంగం సిద్ధమైంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన టీమిండియా.. దక్షిణాఫ్రికాతో అమీతుమీకి రెడీ అయింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ తీసుకున్నాడు. భారత్ ఏమార్పులు లేకుండానే బరిలోకి దిగుతుండగా.. సఫారీ జట్టులో గెరాల్డ్ కోయెట్జ్ స్థానంలో స్పిన్నర్ షంసీని తీసుకుంది.
భారత జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, బుమ్రా, షమీ, సిరాజ్.
దక్షిణాఫ్రికా : క్వింటన్ డికాక్, డసెన్, మార్క్రమ్, హెన్రిచ్, క్లాసెన్, తెంబా బవుమా( కెప్టెన్), కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, జాన్సెన్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి, షంసీ.