ODI World Cup 2023 : టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంకకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. షోరిఫుల్ ఇస్లాం వేసిన ఆఖరి బంతికి స్టార్ ఓపెనర్ కుశాల్ పెరీరా(4) ఔటయ్యాడు. ఐదో బంతికి బౌండ్రీ బాదిన అతను ఆ తర్వాత బాల్కు కీపర్ ముష్ఫికర్ రహీంకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో 5 పరుగులకే లంక తొలి వికెట్ కోల్పోయింది.
మరో ఓపెనర్ పథుమ్ నిస్సంక(31) ధాటిగా ఆడుతున్నాడు. ప్రస్తుతం కెప్టెన్ కుశాల్ మెండిస్(2) ఆడుతున్నారు. 7 ఓవర్లకు లంక స్కోర్.. 38/1. శ్రీలంక, బంగ్లాదేశ్ ఢిల్లీ వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకిబుల్ హసన్ లంకను బ్యాటింగ్కు ఆహ్వానించాడు.
బంగ్లాదేశ్ జట్టు : తంజిద్ హసన్, లిట్టన్ దాస్, హొసేన్ శాంటో, ముష్ఫికర్ రహీం(వికెట్ కీపర్), మహ్మదుల్లా, షకిబుల్ హసన్(కెప్టెన్), తౌహిద్, హెహిదీ హసన్ మిరాజ్, తంజిమ్ సకీబ్, తస్కిన్ అహ్మద్, షొరిఫుల్ ఇస్లాం.
శ్రీలంక జట్టు : పథుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(కెప్టెన్, వికెట్ కీపర్), సమరవిక్రమ, చరిత అసలంక, మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, థీక్షణ, దుశ్మంత చమీర, కసున్ రజిత, మధుశనక.