ODI World Cup: టాస్ గెలిచిన లంక.. ఆసీస్‌దే బౌలింగ్
ODI World Cup: లక్నో వేదికగా ఆస్ట్రేలియా – శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక బ్యాటింగ్ ఎంచుకున్నది. ఆసీస్ తొలుత బౌలింగ్ చేస్తున్నది.
ODI World Cup: వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా శ్రీలంక – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ టాస్ ఓడింది. టాస్ గెలిచిన లంకేయులు బ్యాటింగ్ ఎంచుకున్నారు. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్‌బిహారి వాజ్‌పేయి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ నెగ్గిన లంక సారథి కుశాల్ మెండిస్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. లంక రెగ్యులర్ కెప్టెన్ దసున్ శనక గాయం కారణంగా మెండిస్ సారథ్య బాధ్యతలు మోస్తున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన ఆసీస్ ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే సెమీస్ అవకాశాలు సన్నగిల్లినట్టే.
ఈ మ్యాచ్‌లో దసున్ శనకతో పాటు మతీశ పతిరాన కూడా ఆడటం లేదు. చమీక కరుణరత్నే, లాహిరు కుమారలు జట్టులొకి వచ్చారు. ఆసీస్ జట్టులో మార్పులేమీ లేవు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లోఆడిన జట్టుతోనే కంగారూలు బరిలోకి దిగారు.
తుది జట్లుః
శ్రీలంకః పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, చమీక కరుణరత్నె, దునిత్ వెల్లలాగె, మహీశ్ తీక్షణ, లాహిరు కుమార, దిల్షాన్ మధుశంక
ఆస్ట్రేలియాః మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హెజిల్వుడ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

