ODI World Cup 2023 : వరల్డ్ కప్లో సెమీస్ రేసు నుంచి ఇప్పటికే తప్పుకున్న శ్రీలంక, బంగ్లాదేశ్ ఢిల్లీ వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకిబుల్ హసన్ బౌలింగ్ తీసుకున్నాడు. భారత మ్యాచ్కు దూరమైన కుశాల్ పెరీరా, ధనంజయ డిసిల్వా లంక జట్టులోకి వచ్చారు. బంగ్లా ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. ముస్తాఫిజుర్ బదులు తంజిమ్ షకిబ్ ఆడుతున్నాడు.
బంగ్లాదేశ్ జట్టు : తంజిద్ హసన్, లిట్టన్ దాస్, హొసేన్ శాంటో, ముష్ఫికర్ రహీం(వికెట్ కీపర్), మహ్మదుల్లా, షకిబుల్ హసన్(కెప్టెన్), తౌహిద్, హెహిదీ హసన్ మిరాజ్, తంజిమ్ సకీబ్, తస్కిన్ అహ్మద్, షొరిఫుల్ ఇస్లాం.
శ్రీలంక జట్టు : పథుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(కెప్టెన్, వికెట్ కీపర్), సమరవిక్రమ, చరిత అసలంక, మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, థీక్షణ, దుశ్మంత చమీర, కసున్ రజిత, మధుశనక.