కివీస్ రికార్డు ఛేదన.. కెర్ భారీ శతకం
సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా మంగళవారం ముగిసిన రెండో వన్డేలో న్యూజిలాండ్ మహిళల జట్టు అదరగొట్టింది. ఇరుజట్ల మధ్య బేసిన్ రిజర్వ్ (వెల్లింగ్టన్) వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య జట్టు.. 347 పరుగుల రికార్డు ఛేదనను విజయవంతంగా పూర్తిచేసి మహిళల క్రికెట్లో అత్యధిక ఛేదన చేసిన జట్టుగా రికార్డులకెక్కింది.
వెల్లింగ్టన్ : సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా మంగళవారం ముగిసిన రెండో వన్డేలో న్యూజిలాండ్ మహిళల జట్టు అదరగొట్టింది. ఇరుజట్ల మధ్య బేసిన్ రిజర్వ్ (వెల్లింగ్టన్) వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య జట్టు.. 347 పరుగుల రికార్డు ఛేదనను విజయవంతంగా పూర్తిచేసి మహిళల క్రికెట్లో అత్యధిక ఛేదన చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. సఫారీలు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని కివీస్ మరో రెండు బంతులు మిగిలుండగానే 49.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది.
కెప్టెన్ అమెలియా కెర్ (139 బంతుల్లో 179 నాటౌట్, 23 ఫోర్లు, 1 సిక్స్) అజేయ భారీ శతకానికి తోడు వికెట్‌కీపర్ బ్యాటర్ ఇసాబెల్లా (68) రాణించడంతో ఆ జట్టు.. వన్డేల్లో టీమ్ఇండియా పేరిట ఉన్న రికార్డు (ఆస్ట్రేలియాపై 341)ను చెరిపేసింది. 130 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో కెర్, ఇసాబెల్లా ఐదో వికెట్‌కు 120 రన్స్ జోడించి ఆ జట్టును విజయపథాన నిలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

