షార్జా: నమీబియాతో మ్యాచ్‌లో న్యూజిల్యాండ్ జట్టుకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (18)ను నమీబియా స్టార్ ఆల్‌రౌండర్ డేవిడ్ వీజే అవుట్ చేశాడు. అతని బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన గప్తిల్.. మిడాఫ్‌లో ట్రంపెల్మన్‌కు చిక్కాడు.
దీంతో న్యూజిల్యాండ్ జట్టు 30 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ డారియల్ మిచెల్ (19) ధాటిగా ఆడటంతో తొలి పవర్‌ప్లే ముగిసే సరికి 43/1 స్కోరుతో నిలిచింది. కానీ పవర్‌ప్లే ముగిసిన వెంటనే షాల్జ్ వేసిన బంతిని అంచనా వేయలేకపోయిన మిచెల్ (19) కూడా వాన్ లింగెన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం విలియమ్సన్ (5 నాటౌట్), డెవాన్ కాన్వే క్రీజులో ఉన్నారు.