షార్జా: పటిష్టమైన న్యూజిల్యాండ్తో మ్యాచ్లో పసికూన నమీబియా సత్తా చాటుతోంది. స్వల్పస్కోర్లకే కివీస్ ఓపెనర్లిద్దరికీ పెవిలియన్ చేర్చిన నమీబియా బౌలర్లు ఆ జట్టుకు మంచి బ్రేక్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత మరో వికెట్ పడకుండా కివీస్ సారధి కేన్ విలియమ్సన్ (28), డెవాన్ కాన్వే (15 నాటౌట్) జాగ్రత్త పడ్డారు.
దీంతో పది ఓవర్లు ముగిసే సరికి న్యూజిల్యాండ్ జట్టు 62/2 స్కోరుతో నిలిచింది. అయితే జట్టు స్కోరు 81 పరుగుల వద్ద కివీస్ కెప్టెన్ విలియమ్సన్ను నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే 14 ఓవర్ చివరి బంతికి డెవాన్ కాన్వే (17) అనవసర పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. దీంతో 14 ఓవర్లు ముగిసే సరికి న్యూజిల్యాండ్ జట్టు 87/4 స్కోరు చేసింది.