అబుధాబి: కీలకమైన సెమీఫైనల్ పోరులో న్యూజిల్యాండ్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 13 పరుగులకే ఆ జట్టు కీలకమైన రెండు వికెట్లు కోల్పోయింది. వెటరన్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (4) తొలి ఓవర్ మూడో బంతికే అవుటయ్యాడు. తొలి బంతికి ఫోర్ కొట్టి ఊపు మీద కనిపించిన అతను మూడో బంతిని లెగ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు.
కానీ టైమింగ్ మిస్ అవడంతో అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. మిడాన్‌లో మొయీన్ అలీ అందుకున్న సులభమైన క్యాచ్‌కు గప్తిల్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (5) కూడా అవుటయ్యాడు.
ఎక్కువ డాట్ బాల్స్ పడటంతో ఇబ్బందిలో పడిన విలయమ్సన్.. గట్టి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకోవడంతో అదిల్ రషీద్‌కు సులభమైన క్యాచ్ దక్కింది. రెండు కీలకమైన వికెట్లు తీసిన క్రిస్ వోక్స్.. ఇంగ్లండ్ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్నిచ్చాడు.