వెల్లింగ్టన్: కామెరూన్ గ్రీన్ (103 నాటౌట్; 16 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగడంతో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. లబుషేన్ (1), హెడ్ (1), కారీ (10) విఫలం కాగా.. మిషెల్ మార్ష్ (40), స్మిత్ (31), ఖవాజా (33) తలా కొన్ని పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో హెన్రీ 4 వికెట్లు పడగొట్టాడు.