పుణె: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్ టామ్ లాథమ్ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. రెండో రోజు టీ విరామ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో.. న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో రెండు వికెట్లకు 85 రన్స్ చేసింది. దీంతో న్యూజిలాండ్ ప్రస్తుతం 188 రన్స్ ఆధిక్యంలో ఉన్నది. ఓపెనర్ టామ్ లాథమ్ 37 రన్స్ చేసి క్రీజ్‌లో ఉన్నాడు. టీ బ్రేక్‌కు ముందు 23 రన్స్ చేసిన విల్ యంగ్ ఔటయ్యాడు. అంతకుముందు ఉదయం కివీస్ స్పిన్నర్ సాంట్నర్ ఇండియన్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 156 రన్స్‌కు ఆలౌటైంది.
Tea time in Pune. Tom Latham (37*) and Rachin Ravindra (7*) will resume after the break with a lead of 188 runs. Follow play LIVE in NZ on @skysportnz 📺 or @SENZ_Radio 📻 LIVE scoring https://t.co/VJzmDajMi0 📲 #INDvNZ #CricketNation pic.twitter.com/aigpXgIxeO
— BLACKCAPS (@BLACKCAPS) October 25, 2024