మాడ్రిడ్: మాడ్రిడ్ ఓపెన్‌లో సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో జొకోవిచ్ 3-6, 4-6తో మాటియో అర్నాల్డీ(ఇటలీ) చేతిలో అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు.
తన కెరీర్లో 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన జొకోవిచ్..అనామక ప్లేయర్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మాటియోతో పోరును వరుస సెట్లలో చేజార్చుకున్న జొకోవిచ్ 32 సార్లు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.