పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్, జ్వెరెవ్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్ 6-1, 6-3, 6-3తో డియెగో స్వార్ట్మన్ (అర్జెంటీనా)ను చిత్తు చేశాడు. మరో పోరులో మూడో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 7-6 (13/11), 7-5, 6-3తో మిరేల్స్ (స్పెయిన్)పై నెగ్గి ముందంజ వేశాడు. మహిళల్లో ఫెర్నాండెజ్, కొకో గాఫ్, ట్రెవిసన్ ముందంజ వేశారు. మరోవైపు మిక్స్డ్ డబుల్స్‌లో భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా పోరాటం ముగిసింది.