న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ సెమీస్‌లో జోకోవిచ్(Novak Djokovic) ఎంట్రీ ఇచ్చాడు. క్వార్టర్స్‌లో అతను 6-3, 7-5, 3-6, 6-4 స్కోరుతో టేలర్ ఫ్రిట్జ్‌పై గెలుపొందాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత జోకో చిందేశాడు. కేపాప్ డెమన్ హంటర్స్ మూవీకి చెందిన హిట్ సాంగ్‌పై అతను స్టెప్పులేశాడు. ఆ డ్యాన్స్ తన కూతురు తారా వద్ద నేర్చుకున్నట్లు అతను చెప్పాడు. తారాకు 8 ఏళ్లు నిండాయి. కూతురి బర్త్‌డే నేపథ్యంలో ఆ సంతోషాన్ని పంచుకున్నాడు.
ఆర్దర్ ఆషే స్టేడియంలో మ్యాచ్ నెగ్గానే కూతురికి ఇష్టమైన పాటపై డ్యాన్స్ చేశాడు. తన డ్యాన్స్ చూసిన తర్వాత తారా తనకు రేటింగ్ ఇవ్వనున్నట్లు జోకో తెలిపాడు. ఇంటి వద్ద రకరకాలుగా డ్యాన్స్ చేస్తుంటామని, దానిలో ఇదో రకం స్టెప్పు అని అతను పేర్కొన్నాడు. తెల్లవారుజామున నిద్రలేచక తన కూతురు నవ్వుకుంటుందేమో అని అతను చెప్పాడు.
సోనీ పిక్చర్స్-నెట్‌ఫ్లిక్స్ మూవీలో వచ్చే కేపాప్ డీమన్ హంటర్స్ చూసి డ్యాన్స్ నేర్చుకున్నట్లు చెప్పాడు.
Novak Djokovic is dancing into the semifinals of the US Open. pic.twitter.com/SgyMP6y1kr
— US Open Tennis (@usopen) September 3, 2025