లండన్: పురుషుల టెన్నిస్‌లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్.. స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ పేరిట ఉన్న మరో రికార్డును అధిగమించాడు. ఏటీపీ టూర్స్ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకు సాధించిన అత్యంత పెద్ద వయస్కుడిగా జొకో నిలిచాడు. ప్రస్తుతం 36 ఏండ్ల నొవాక్.. వచ్చేనెలలో 37వ పడిలో పడతాడు. ఫెదరర్ 2018 జూన్ నాటికి 36 ఏండ్ల వయసులో మొదటి ర్యాంకులో ఉన్న అతిపెద్ద వయస్కుడిగా రికార్డులకెక్కగా సెర్బియా స్టార్ దానిని అధిగమించాడు. ఇదిలాఉండగా మాంటెకార్లో ఓపెన్ మాస్టర్స్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి రౌండ్లో జొకోవిచ్.. 6-1, 6-2 తేడాతో రొమన్ సఫియుల్లిన్ (రష్యా)పై అలవోక విజయం సాధించాడు.